Site icon TeluguMirchi.com

Bakasura : ఓటీటీలో దుమ్ము రేపుతున్న బకాసుర రెస్టారెంట్… మూడు రోజుల్లోనే ట్రెండింగ్‌లోకి!

Bakasura ott
హారర్-కామెడీ శైలిలో తెరకెక్కిన బకాసుర రెస్టారెంట్ సినిమా ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే టాప్ ట్రెండింగ్ తెలుగు టైటిల్స్‌లో ఆరో స్థానాన్ని దక్కించుకుంది. ప్రేక్షకులను అలరించే హారర్ కామెడీ మేళవింపుతో ఈ సినిమా వినూత్నంగా తెరకెక్కి ఆకట్టుకుంటోంది.

ప్రవీణ్, హర్ష చెముడు, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం, వినూత్న ట్రీట్‌మెంట్ మరియు క్వర్కీ పెర్ఫార్మెన్స్‌లతో ప్రేక్షకులను ఆకర్షించింది. ప్రైమ్ వీడియోతో పాటు SUN NXT లో కూడా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా మరింత విస్తృత ప్రేక్షకులకు చేరుతోంది. తక్కువ సమయంలోనే మంచి స్పందన సాధించిన బకాసుర రెస్టారెంట్, ఈ సీజన్‌లో ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో ఈ సినిమా మరింత విజయవంతం అవుతుందని ఫిల్మ్ యూనిట్ నమ్ముతోంది.

Exit mobile version