రాక్షసుడు సినిమా హిట్ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. హారర్ జోనర్ లో బెల్లంకొండ ఎదో కొత్తగా ట్రై చేస్తున్నాడనే క్యూరియాసిటీ కలిగించాడు.
కాగా నిన్న రాత్రి హైదరాబాద్ లోని AAA ముల్టీప్లెక్స్ లో ‘కిష్కింధపురి’ స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించారు. ప్రీమియర్ షో రెస్పాన్స్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ ను టైట్ స్క్రీన్ ప్లే తో ఎక్కడ డీవియేట్ అవకుండా కథ చెప్పిన విధానం బాగుంది. ఎప్పుడైతే కిష్కింధపురి లోని సువర్ణ మాయలోకి హీరో అడుగుపెడతారో అక్కడ నుండి సినిమా పరిగెడుతూ నెక్ట్స్ ఎం జరగబోతుందనే ఉత్కంఠతో సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాడు. ఒక అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ కార్డు వేసారు. ఇక సెకెండ్ హాఫ్ లో ట్విస్ట్ లకు ఆడియెన్స్ కు గూస్ బమ్స్ రావడం పక్కా. కొన్ని ట్విస్ట్ లు ఊహించిన దానికి మించి ఉంటాయి. తమిళ నటుడు శాండ నటన బయపెడుతుంది. బెల్లంకొండ అద్భుతంగా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ సూపర్ అనే చెప్పాలి. ఇక చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. KGF కు పని చేసిన సౌండ్ ఇంజనీర్ ఎం.ఆర్. రాజా కృష్ణన్ ఇచ్చిన సౌండింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ‘కిష్కింధపురి’ సూపర్ హిట్ అనే చెప్పాలి. రాక్షసుడు జోడి మరోసారి ఆడియెన్స్ ను భయపెట్టింది.

