Site icon TeluguMirchi.com

Bhagyashri Borse: ‘లెనిన్‌’లో శ్రీలీల ప్లేస్‌లో నేనే ఎందుకు వచ్చా? అసలు విషయం చెప్పేసిన భాగ్యశ్రీ భోర్సే!

BhagyashriBorse

Bhagyashri Borse: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లెనిన్’. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటీవ్ టాక్‌తో థియేటర్స్‌లో మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసి, అనంతరం ఆమె స్థానంలో భాగ్యశ్రీ భోర్సేను తీసుకోవడంతో అప్పట్లో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ సందర్భంగా ఆమె శ్రీలీల గురించి మాట్లాడుతూ.. “శ్రీలీల చాలా స్వీట్ గర్ల్. ఆమె అసాధారణమైన టాలెంట్ ఉన్న నటి” అంటూ ప్రశంసలు కురిపించారు.

ఒక సినిమాలో ఎవరు నటించాలనే నిర్ణయం పూర్తిగా నిర్మాత, దర్శకుడి చేతుల్లోనే ఉంటుందని ఈ సందర్భంగా భాగ్యశ్రీ భోర్సే స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా నమ్మేది ఒక్కటేనని, చివరికి ఏ పాత్రకు ఏ నటుడు లేదా నటి సరిపోతారో నిర్ణయించేది స్క్రిప్ట్ మాత్రమేనని అన్నారు. సినిమా నిర్మాణ సమయంలో కథ, పాత్రలు లేదా ఇతర క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మార్పులు జరగడం చిత్ర పరిశ్రమలో సహజమేనని భాగ్యశ్రీ పేర్కొన్నారు. అలాంటి నిర్ణయాలను వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రతి నటుడు తనకు వచ్చిన అవకాశాన్ని అత్యుత్తమంగా వినియోగించుకోవడంపైనే దృష్టి పెట్టాలని ఆమె అభిప్రాయపడ్డారు. భాగ్యశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీలీలపై గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే, తన ఎంపిక వెనుక ఎలాంటి వ్యక్తిగత కారణాలు లేవని, అది పూర్తిగా చిత్ర బృందం తీసుకున్న నిర్ణయమేనని ఆమె చెప్పడం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Exit mobile version