
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్‌లో వైరల్ అవుతుంది. పోస్టర్ క్వాలిటీ, అందులోని కనిపిస్తున్న విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో అసలు ఏంటి ఈ పోస్టర్ అని అభిమానులు సర్చింగ్ స్టార్ట్ చేశారు. నిజానికి ఈ పోస్టర్‌ను గమనిస్తే.. ఇది పూర్తిగా ఒక ఏలియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనే వైబ్స్‌ను ఇస్తోంది. అంతరిక్ష పరిశోధనలు, స్పేస్ సైన్స్ నేపథ్యంలో ధనుష్ కొత్త సినిమా తెరకెక్కబోతోందనే సంకేతాలు ఈ ఫోటో అర్థం అవుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ నెల 10న రాబోతుందని ఈ మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇప్పటి వరకు తెరకెక్కిన వెంకట్ ప్రభు మార్క్ సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా, సరికొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూసిన సినీ ప్రియులు, అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి? ధనుష్ లుక్ ఎలా ఉండబోతోంది? అని ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు గత చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (#GOAT) కంటే ఈ సినిమా స్కేల్, బడ్జెట్ పరంగా చాలా పెద్దదిగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ వర్సటైల్ యాక్టింగ్, వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే మ్యాజిక్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ 10 వ తేదీన ధనుష్ కొత్త సినిమా పూర్తి కథ ఏంటో తెలియనుంది.
