![]()
Mahavatar Narsimha: భారతీయ పురాణ గాథలను యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాలు టాలీవుడ్‌లో వేగం పుంజుకుంటున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ‘మహావతార్ నరసింహ’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ యానిమేషన్ చిత్రానికి వచ్చిన మంచి స్పందనతో ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా ఈ జానర్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ మరో ప్రతిష్ఠాత్మక యానిమేషన్ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. ఈసారి శక్తి స్వరూపిణి కాళీమాత కథను యానిమేషన్ రూపంలో ప్రేక్షకులకు పరిచయం చేయాలని గీతా ఆర్ట్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన దేవతగా భావించే కాళీమాత జీవితం, ఆమె అవతార విశేషాలు, దుష్ట సంహారం వంటి అంశాలను ఈ యానిమేషన్ టెక్నాలజీతో అద్భుతంగా ఆవిష్కరించేలా వ్యూహాలు రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ, స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. ఇటీవల కాలంలో ఇతిహాసాలు, పురాణ కథల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ గీతా ఆర్ట్స్ కూడా భారీ స్థాయిలో ఈ యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత రానుంది.
