Site icon TeluguMirchi.com

Devara 2 : ‘దేవర 2’ కోసం సిద్ధం అవ్వండి.. NTR ఆర్ట్స్ నుంచి బిగ్ అప్డేట్

Devara2
Devara 2 : జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా హిట్ హైయాక్షన్ థ్రిల్లర్ ‘దేవర: పార్ట్ 1’ 2024, సెప్టెంబర్ 27న విడుదలై బాక్సాఫీస్‌లో సంచలన విజయం సాధించింది. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లో కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పార్ట్ 2పై ఎలాంటి అప్డేట్ లేదు. దీని కారణంగా ఫ్యాన్స్‌లో కొంత నిరాశ ఏర్పడింది. అయితే ఈ సినిమా విడుదలై ఒక సంవత్సరం పూర్తైన సందర్భంగా NTR ఆర్ట్స్ తాజాగా ఒక సంచలన ప్రకటన చేసింది. “దేవర తాండవానికి ఏడాది పూర్తయింది. దేవర 2 కోసం సిద్ధంకండి!” అంటూ X లో పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

“ప్రతీ తీరాన్ని వణికిస్తూ విధ్వంసం తీరాలను తాకి ఏడాది అయ్యింది. ప్రపంచం గుర్తించుకునే పేరు ‘దేవర’. అది భయం అయినా, అది సంపాదించిన ప్రేమ అయినా ఎవరూ ఎప్పటికీ మర్చిపోరు. ఇప్పుడు ‘దేవర 2’ కోసం సిద్ధం అవ్వండి” అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం, జోష్ మళ్ళీ తిరిగొచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా చేస్తున్నారు.

Exit mobile version