Site icon TeluguMirchi.com

Gopichand33 : ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ లో గోపీచంద్

Gopichand33
మాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #గోపీచంద్33 భారీ స్థాయిలో రూపొందుతోంది. విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో నిర్మితమవుతున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లో కొత్త మైలురాయిగా నిలుస్తుందని సినిమా యూనిట్ విశ్వసిస్తోంది. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తయి, సుమారు 55 రోజుల షూటింగ్ పూర్తైంది.

ప్రస్తుతం హీరో గోపీచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలవనుందని, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభూతిని అందిస్తుందని యూనిట్ చెబుతోంది. గోపీచంద్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్, గ్లింప్స్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. యోధుడిలా కనిపించిన గోపీచంద్ తన పాత్రలోని ఇన్టెన్సిటీతో అభిమానులను ఆకట్టుకున్నారు.

విభిన్నమైన కథా దృక్పథంతో, సాంకేతిక నైపుణ్యంతో పేరు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి, ఈ చిత్రంతో భారత చరిత్రలోని ఒక ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపై చూపించబోతున్నారు. విజువల్ గ్రాండ్యూర్, హై ఎమోషన్, పవర్‌ఫుల్ యాక్షన్‌ల మేళవింపుగా ‘#గోపీచంద్33’ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది — సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version