Site icon TeluguMirchi.com

Hari Hara Veera Mallu Trailer : వీరమల్లు విధ్వంసం సృష్టించాడుగా..


Hari Hara Veera Mallu Trailer : పవన్‌ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరిహర వీరమల్లు : పార్ట్ 1-స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. పవన్ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసారు మేకర్స్.

మేకర్స్ ముందు నుంచి చెప్తున్నట్లుగానే ట్రైలర్ అదిరిపోయింది. హిందువుగా జీవించాలంటే ప‌న్ను క‌ట్టాల్సిన స‌మ‌యం. ఈ దేశ శ్ర‌మ బాద్‌షా పాదాల కింద న‌లిగిపోతున్న స‌మ‌యం. ఒక వీరుడు కోసం ప‌కృతి పురుడు పోసుకుంటున్న స‌మ‌యం అంటూ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ట్రైలర్.. ఊహించని విజువల్స్ ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్ తో అదరహో అనేలా వుంది. వీరమల్లు అనే యోధుడి పాత్ర‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ విధ్వంసం సృష్టించారు. ఇక పవన్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటిదాకా మేకల్ని తినే పులుల్ని చూసుంటావ్.. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బులిని చూస్తావ్ అన్న డైలాగ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఎం.ఎం. కీరవాణి సంగీతం, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ట్రైలర్‌కు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చాయి. ఔరంగజేబుగా బాబీ డియోల్ ఆకట్టుకోగా, నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేసింది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రీయేట్ చేసిందనే చెప్పొచ్చు.

Exit mobile version