
టాలీవుడ్‌లో ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన హీరో వెంకట్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ‘OG’, ‘శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి’, ‘అన్నయ్య’, ‘ప్రేమ కోసం’, ‘శివ రామరాజు’ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ హరుడుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన రాగా, తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. సమ్మర్ స్పెషల్‌గా మే 8న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. “ఇది పూర్తిగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథ ఇది. వెంకట్ గారికి ఇది మంచి కమ్‌బ్యాక్ మూవీ అవుతుంది” అని చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రంలో హెబ్బా పటేల్, సలోని, నటాషా, అలీ, సుమన్, రవి వర్మ, సుభాశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణి జీన్న సంగీతం అందిస్తుండగా, ఆనంద్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. విభిన్నమైన కథ, మాస్ ఎలిమెంట్స్‌తో ‘హరుడు’ ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
