Site icon TeluguMirchi.com

Huma Qureshi: యష్ ‘టాక్సిక్’పై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు!

Huma Qureshi

Huma Qureshi: యాక్షన్ ప్రియులు, సినీ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ‘కేజీఎఫ్’ సిరీస్‌తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ప్రముఖ బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక దృశ్యాలను వీక్షించినట్లు స్వయంగా వెల్లడించారు.

ఈ సినిమాకు సంబంధించిన దాదాపు 8 నుంచి 9 నిమిషాల నిడివి గల రఫ్ కట్ చూసే అవకాశం తనకు దక్కిందని హ్యూమా ఈ సందర్భంగా తెలిపారు. ఆ ఫుటేజ్ చూశాక తనకు మైండ్ బ్లాక్ అయిందని, ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకు ఎన్నడూ చూడని విజువల్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని ఆమె వెల్లడించారు. వెండితెరపై ఈ చిత్రం ఒక అద్భుతమైన విజువల్ వండర్‌గా నిలవడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా హీరో యష్ నటన, సినిమాపై ఆయనకున్న ప్యాషన్ గురించి హ్యూమా ఖురేషి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాత్ర కోసం యష్ తనను తాను పూర్తిగా మార్చుకున్నారని, ‘టాక్సిక్’ చిత్రంతో ఆయన తన గత రికార్డులను తానే అధిగమించబోతున్నారని పేర్కొన్నారు. మరోవైపు, సినిమా రిలీజ్‌పై వస్తున్న వార్తలకు కూడా ఆమె క్లారిటీ ఇచ్చారు. టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, చిత్ర బృందం సినిమాను త్వరగా పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలనే తొందరలో లేరని.. ప్రేక్షకులకు ఒక బెస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడమే లక్ష్యంగా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వర్క్ చేస్తున్నారని హ్యూమా ఖురేషి వెల్లడించారు. ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్స్‌తో యష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.

Exit mobile version