Site icon TeluguMirchi.com

Inaya: ‘లేట్ నైట్స్.. బ్లర్రీ లైట్స్’ లో అందాలు హైలైట్

Inaya

Inaya 2
Inaya: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 6 ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇనాయ సుల్తానా (దౌలత్ సుల్తానా) సోషల్ మీడియాలో తన స్టన్నింగ్ లుక్స్‌తో రెగ్యులర్‌గా ఆకట్టుకుంటున్నారు. షోలో తన ఒరిజినల్ అటిట్యూడ్, ఎమోషనల్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఆమె, షో తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోయినా, అభిమానులని మాత్రం తన స్టైల్‌తో ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూనే ఉంది.

తాజాగా ఇనయ సుల్తానా రెడ్ కలర్ వన్ పీస్ డ్రస్‌లో మెరిసిపోతూ దిగిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘‘Late nights, blurry lights’’ అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలు పంచుకున్న ఆమె, రాత్రి సమయంలో స్ట్రీట్‌లో క్లిక్ అయిన ఫోజులతో హాట్ టాక్ క్రియేట్ చేస్తోంది.

ఫిల్మ్ అవకాశాలు తక్కువగానే ఉన్నా… సోషల్ మీడియాలో మాత్రం ఇనయ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్ డోస్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కాకపోయినా… తను ఎంట్రీ ఇస్తున్న కొత్త సినిమాలపై అఫిషియల్ సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ ఫోటోలు చూస్తుంటే మాత్రం, “ఇనయ మళ్లీ తెరపై మెరవాల్సిందే!” అనే కామెంట్లు నెట్టింట్లో వినిపిస్తున్నాయి.

Exit mobile version