
Irumudi Business: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రవితేజను డిఫరెంట్ షేడ్స్‌లో చూపించబోతున్నారనే ప్రచారం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఇరుముడి’ థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు ఆసక్తికరంగా మారాయి. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ‘ఇరుముడి’ ప్రీ-రిలీజ్ బిజినెస్ ఫ్యాన్సీ రేట్లకు జరిగినట్లు సమాచారం. సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.20 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు రూ.21 కోట్లుగా ఉండనుందని ట్రేడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంటే విడుదలైన తర్వాత థియేట్రికల్ రన్‌లో దాదాపు రూ.21 కోట్ల షేర్ సాధిస్తే సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఈ సినిమా రిలీజ్‌కు ముందే దాదాపు రూ.10 కోట్ల వరకు లాభం వచ్చినట్లు ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో సినిమా విడుదల తర్వాత కూడా మరో రూ.10–20 కోట్ల వరకు లాభాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు పూర్తిగా ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చల ఆధారంగానే ఉన్నాయి. ఇక ‘ఇరుముడి’కి ఫస్ట్ డే ఎలాంటి టాక్ వస్తుందన్నదే బాక్సాఫీస్ పరంగా కీలకంగా మారనుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే రవితేజ సినిమా తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా రవితేజ మాస్ ఇమేజ్ సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. ఎప్పటినుంచో మంచి మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజకు ‘ఇరుముడి’ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద రవితేజ మాస్ జాతర ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.
