Site icon TeluguMirchi.com

Jailer 2: రజనీ ‘జైలర్ 2’లో నోరా ఫతేహి గ్లామర్ బ్లాస్ట్.. అనిరుధ్ బీట్‌తో ఇంటర్నెట్ షేక్!

Jailer

Jailer 2: సూపర్‌‌స్టార్ రజనీకాంత్ మాస్ మేనియాకు, గ్లామరస్ సెన్సేషన్ నోరా ఫతేహి అదిరిపోయే స్టెప్పులు తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. బ్లాక్‌బస్టర్ హిట్ ‘జైలర్’కు సీక్వెల్‌గా నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 15న వెండితెరపై దండయాత్రకు సిద్ధమవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన స్పెషల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

‘గుడియా బిందాసు బిందాసు వాలి.. దిల్‌పై పట్టాసు జుక్కాస్‌ లేడీ… ఇదిగో అనార్కళీ రా..’ అంటూ సాగే ఈ పాటలో నోరా ఫతేహి తనదైన గ్లామర్, కిక్కిచ్చే మూమెంట్స్‌తో కుర్రకారు మతిపోగొట్టేసింది. ‘దునియా మోనోపోలీరా.. ఇక అతని చుట్టూరా.. మీ ఎత్తులు అన్నీ చిత్తేరా..’ అంటూ హీరో ఎలివేషన్‌తో సాగే లిరిక్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన మాస్ బీట్స్, గాయని దీప్తి సురేశ్‌తో కలిసి ఆయన పాడిన తీరు పాటకు అదిరిపోయే ఎనర్జీని తీసుకొచ్చాయి. శ్రీనివాస మౌళి క్యాచీ పదాలతో లిరిక్స్ అందించారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో నోరా డ్యాన్స్ నంబర్ సినిమాపై బజ్‌ను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ ‘బిందాస్’ సాంగ్ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Exit mobile version