
Jatadhara : ‘జటాధర’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవ దళపతి సుధీర్ బాబు మరియు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్-ఇండియా ద్విభాషా మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఇటీవల విడుదలైన టీజర్ నేషనల్ వైడ్‌గా వైరల్ అయ్యింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ ట్రాక్ ‘సోల్ ఆఫ్ జటాధార’ను రిలీజ్ చేశారు. ఈ పాటలోని సాంప్రదాయ సంగీతం, డివైన్ టచ్ కలిపిన స్వరాలు మనల్ని జటాధర ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ‘ఓం నమఃశివాయ’ జపం అయితే గూస్ బంప్స్ తెప్పించింది.
రాజీవ్ రాజ్ కంపోజ్ చేసి, స్వయంగా పాడిన ఈ ఆడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి–విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రం చూపిస్తుంది. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో, ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ చిత్రానికి జీ మ్యూజిక్ పవర్‌ఫుల్ సౌండ్‌స్కేప్‌ను అందిస్తోంది. ‘జటాధర’ నవంబర్ 7, 2025న హిందీ మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
