
Jr NTR: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లకు సంబంధించిన సినిమాలపై ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ విషయంలో అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంటుంది. తాజాగా ఓ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించి రెండు పవర్‌ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమ్మేత వీరరాఘవ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ క్రమంలో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టు చాలా కాలంగా ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సినిమా కథ, హీరో పాత్రకు ఈ పేరు సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే తాజాగా దీనికి ప్రత్యామ్నాయంగా మరో బలమైన టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే ‘దేవ సేనాపతి’.
ఇప్పటికే ఈ రెండు పేర్లను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై రిజిస్టర్ చేయించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేస్తారనే దానిపై ఆసక్తి మరింత పెరిగింది. ఒకవైపు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ మాస్ అప్పీల్‌ను కలిగి ఉండగా.. మరోవైపు ‘దేవ సేనాపతి’ అనే పేరు పౌరాణిక, వీరత్వం కలిగిన భావనను కలిగిస్తోంది. అయితే టైటిల్ రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన వాటిలో ఏదో ఒకటి సినిమాకు ఖరారైందని చెప్పలేం. సాధారణంగా మేకర్స్ ఒకటి కంటే ఎక్కువ టైటిల్స్‌ను ముందుగానే రిజిస్టర్ చేయించి, కథకు, హీరో పాత్రకు, మార్కెట్‌కు ఏ పేరు బాగా సరిపోతుందో పరిశీలిస్తుంటారు. చివరికి వీటిలో ఒకదానిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అభిమానుల్లో కూడా ఏ టైటిల్ పెడతారనే క్యూరియాసిటీ పెరిగింది. ‘గాడ్ ఆఫ్ వార్’నా? లేక ‘దేవ సేనాపతి’నా? అనే ప్రశ్నకు మేకర్స్ ఎప్పుడు సమాధానం చెబుతారో చూడాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ టైటిల్స్‌పై వస్తున్న సమాచారం ప్రచారంగానే పరిగణించాల్సి ఉంటుంది.
