
NTR x Trivikram: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో భారీ క్రేజీ కాంబినేషన్ అధికారికంగా పట్టాలెక్కింది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ (Jr NTR), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మళ్లీ చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని ఒక పవర్‌ఫుల్ డివైన్ అవతారంలో కనిపించబోతున్నారు. “ది సన్ ఆఫ్ శివ .. ది ప్రైడ్ ఆఫ్ పార్వతి.. ది ఎటర్నల్ కమాండర్” అంటూ తాజాగా ఎన్టీఆర్ పోస్ట్ చేసిన ఎలివేషన్ లైన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్.. శివపార్వతుల కుమారుడు, కుమారస్వామి (షణ్ముఖుడు / కార్తికేయ) పాత్రను పోషిస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ బాలనటుడిగా ‘బాల రామాయణం’ చిత్రంలో శ్రీరాముడిగా, ‘యమదొంగ’లో యముడిగా పౌరాణిక శైలి పాత్రల్లో తన నటనతో, డైలాగ్ డెలివరీతో మెప్పించారు. ఇప్పుడు ఒక పూర్తి స్థాయి పౌరాణిక చిత్రంలో దేవసేనాధిపతిగా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించనుండటంతో అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ కెరీర్‌లోనే ఇది మొదటి పౌరాణిక చిత్రం కావడం విశేషం. ప్రముఖ నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ (చిన్నబాబు), సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, పాన్-ఇండియా స్థాయిలో ఈ మైథలాజికల్ ఎపిక్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో) షూటింగ్‌తో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, త్రివిక్రమ్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే వర్కింగ్ టైటిల్స్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
The Son of Shiva.
The Pride of Parvathi.
The Eternal Commander.And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu
— Jr NTR (@tarak9999) June 29, 2026
