Site icon TeluguMirchi.com

Kaka: సంక్రాంతి బరిలో ‘కాకా’.. రూమర్లకు చెక్ పెట్టిన టీం!

Cinema

Kaka: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పండగ బరి అంటేనే భారీ అంచనాలు, అంతకుమించిన పోటీ. అయితే గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి కాకా మూవీ వాయిదా పడుతోందంటూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం జరిగింది. తీవ్రమైన పోటీ నడుమ ఈ చిత్రం వెనక్కి తగ్గుతుందేమోనన్న అనుమానాలు మెగా అభిమానుల్లో టెన్షన్ పుట్టించాయి. వాటన్నింటికీ ఒక్క అధికారిక ప్రకటనతో ఫుల్ స్టాప్ పెట్టేసింది చిత్ర బృందం. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రపంచ వ్యాప్తం ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న థియేటర్లలోకి గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

సినిమా వాయిదా పడుతుందనే ప్రచారాలకు డైరెక్టర్ బాబీ కొల్లి తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. “ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు.. ఒక్క రోజు కూడా ఆలస్యం ఉండదు. ఈ సంక్రాంతిని మన ఖాతాలో వేసుకునేందుకే గట్టిగా వస్తున్నాం” అంటూ ఆయన ఇచ్చిన మాస్ స్టేట్‌మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సంక్రాంతి బరి ఎంత రద్దీగా ఉన్నా తగ్గేదేలే అంటూ మేకర్స్ క్లారిటీ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్‌ను మునుపెన్నడూ చూడని విధంగా రెండు విభిన్నమైన షేడ్స్‌లో, హై-వోల్టేజ్ యాక్షన్ రోల్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌లోకి సీనియర్ నటి స్నేహ కూడా చేరడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కాకా’.. పండగ సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పూర్తి స్థాయిలో రెడీ అవుతోంది.

Exit mobile version