
Kannappa Hindi Satellite Rights : ఇటీవల విడుదలైన తెలుగు భక్తిరస చిత్రమైన ‘కన్నప్ప’ విష్ణు మంచు ప్రధాన పాత్రలో విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంటోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, బాక్సాఫీస్ వద్ద కూడా పెద్ద విజయాన్ని నమోదు చేస్తోంది.
తాజాగా, ముంబయికి చెందిన ఓ ప్రముఖ ఏజెన్సీ హిందీ శాటిలైట్ హక్కులను రూ. 20 కోట్లకు కొనుగోలు చేసిందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విష్ణు మంచు నటించిన సినిమాల్లో ఇదే అత్యధిక ధర. ఈ భారీ డీల్ ద్వారా ‘కన్నప్ప’ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉన్నదో స్పష్టమవుతోంది. ఇక ఓటీటీ హక్కుల విషయంలోనూ భారీ రెస్పాన్స్ వస్తుందని అంచనా. మోహన్ బాబు నిర్మించిన ఈ పాన్-ఇండియా చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముఖుందన్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా, సంగీతాన్ని స్టీఫెన్ దేవస్సీ అందించారు.
