Site icon TeluguMirchi.com

Katrina Kaif: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌కు కత్రినా కైఫ్ దిమ్మతిరిగే కౌంటర్!

Katrina Kaif

Katrina Kaif: ప్రసవానంతరం బరువు పెరిగారంటూ సోషల్ మీడియాలో తన శరీరాకృతిపై వస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పరోక్షంగా స్పందించారు. బాహ్య కొలతల కంటే శారీరక ఆరోగ్యం, ఆత్మవిశ్వాసమే అసలైన అందమని ఆమె తేల్చి చెప్పారు. పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తాను కూడా నిర్దిష్టమైన అందాల ప్రమాణాలను పాటించానని, అయితే కాలక్రమేణా ఆ ఆలోచనా విధానం మారిందని కత్రినా పేర్కొన్నారు. మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఉన్నతంగా కనిపిస్తారని, పైకి కనిపించే బాహ్య రూపం ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

ఈ ట్రోలింగ్‌పై సీనియర్ నటి ఖుష్బూ తీవ్రంగా స్పందిస్తూ కత్రినాకు అండగా నిలిచారు. ప్రసవానంతరం మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు సహజమని, ఆ విజ్ఞత లేకుండా హేళన చేయడం సరికాదని మండిపడ్డారు. గతంలో తాను కూడా ఇలాంటి బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని, మహిళలు తమను తాము ప్రేమించుకోవడమే ఇలాంటి విమర్శకులకు సరైన సమాధానమని ఖుష్బూ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులు కత్రినాకు మద్దతు తెలుపుతున్నారు.

Exit mobile version