Site icon TeluguMirchi.com

Malayalam Movie: అరుదైన హిస్టరీ క్రియేట్ చేసిన మలయాళ మూవీ!

Bethlehem Family Unit

Malayalam Movie: మలయాళ చిత్ర పరిశ్రమ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. కంటెంట్ ప్రధానంగా సాగే చిత్రాలతో ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌’ తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సైతం రేర్ హిస్టరీ క్రియేట్ చేసి సంచలనం సృష్టించింది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించడమే కాకుండా, ఓటీటీ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ప్రముఖ స్ట్రీమింగ్ ట్రాకర్ ‘ఆర్‌మాక్స్ స్ట్రీమ్‌వ్యూ’ వెల్లడించిన నివేదిక ప్రకారం.. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో అక్టోబరు 2 నుంచి 4 వరకు అత్యధికంగా వీక్షించిన నాన్-హిందీ చిత్రంగా ‘బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్’ సరికొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన అన్ని భాషల వర్షన్లలో, మొదటి వీకెండ్‌లోనే 30 నిమిషాలకు పైగా చూసిన ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా ఈ సినిమా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కే పరిమితం కాలేదు. ఈ ఏడాది భారతదేశం అంతటా (అన్ని భాషల సినిమాలను పరిగణనలోకి తీసుకుంటే) అత్యంత ప్రజాదరణ పొందిన థియేట్రికల్ చిత్రంగా నిలిచి ఏకంగా 92 ఆర్‌మాక్స్ పవర్ రేటింగ్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.

ఈ చారిత్రక విజయంపై ప్రముఖ నటుడు, నిర్మాత ఫహద్ ఫాజిల్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. మాలీవుడ్ హిస్టరీలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా తమ చిత్రం నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. భావనా స్టూడియోస్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లకు ఈ విజయం ఎంతో ప్రత్యేకమని చెప్పారు. సరికొత్త ఆలోచనలను, అర్థవంతమైన కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ ప్రేక్షకులకు ఉత్తమ సినిమా అనుభూతిని పంచడమే తమ ధ్యేయమని, ఈ సక్సెస్ మొత్తం దర్శకుడు గిరీశ్ ఏడీతో పాటు నటీనటులైన నివిన్ పౌలీ, మమితా బైజులకు దక్కుతుందని ప్రశంసించారు. గిరీశ్ ఏడీ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సెప్టెంబరు 4న థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ రికార్డు స్థాయి వ్యూవర్‌షిప్‌తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ రికార్డులతో సరిపెట్టకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైనా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండటం ఈ సినిమా ప్రత్యేకతను చాటుతోంది.

bethlehem-family-unit-creates-rare-ott-history-jiohotstar-record

Exit mobile version