
Mega 158 Title: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో వస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌పై ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘కదిరి కాకాజీ’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారనే బజ్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ‘కదిరి’ అనే పేరు చిరంజీవి నోటి నుంచి అనుకోకుండా బయటకు రావడంతో ఈ టైటిల్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. ‘కోరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి ఈ సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ‘కదిరి’ అనే పదం ప్రస్తావించడంతో అక్కడే టైటిల్ లీక్ అయిందనే ప్రచారం మొదలైంది.
ఇప్పుడు ‘కదిరి’ మాత్రమే కాకుండా పూర్తి టైటిల్ ‘కదిరి కాకాజీ’ అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ టైటిల్‌పై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజంగా ఫైనల్ చేసిన టైటిలేనా? లేక మేకర్స్ మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘మెగా 158’ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో ఒక నిమిషానికి పైగా నిడివి ఉన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేసి చిరంజీవి పాత్రను పరిచయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సినిమాల టైటిల్స్ అనుకోకుండా లీక్ కావడం అభిమానులకు కొత్తేమీ కాదు. ఇప్పుడు ‘కదిరి కాకాజీ’ అనే టైటిల్ కూడా ముందుగానే బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. టైటిల్‌కు తగ్గట్టుగానే చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోంది? బాబీ ఎలాంటి మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి ఆగస్టు 22న నిజంగానే ‘కదిరి కాకాజీ’ టైటిల్‌ను ప్రకటిస్తారా? చిరంజీవి ఫస్ట్ గ్లింప్స్‌లో ఎలా కనిపించబోతున్నారు? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
