Site icon TeluguMirchi.com

Varun Tej – Lavanya : మెగా ఫ్యామిలీకి కొత్త వారసుడు.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి

Varun lavanya
Varun Tej – Lavanya : మెగా కపుల్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులయ్యారు. కాసేపటి క్రితం లావణ్య మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది. శుభవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి, వరుణ్ – లావణ్యలను ఆశీర్వదించారు.

2023 నవంబర్ 1న వివాహం చేసుకున్న లావణ్య – వరుణ్ తేజ్, ఇప్పుడు తల్లిదండ్రులుగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన సమయాన్ని కుటుంబానికే కేటాయించింది. ప్రస్తుతం పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో మెగా కపుల్ పై అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.

Exit mobile version