Site icon TeluguMirchi.com

Mega158 : మెగా158 నుంచి క్రేజీ అప్‌డేట్.. పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి

Mega158 schedule
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న #Mega158 (#ChiruBobby2) చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్ర బృందం తాజాగా పొల్లాచ్చిలో నిర్వహించిన హై-ఎనర్జీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు మేకర్స్ వెల్లడించారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుండగా, ఈ సినిమాతో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతున్నామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనశ్వర రాజన్ , నివేదా థామస్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, సంగీతాన్ని S. Thaman అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని KVN Productions బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.

Exit mobile version