Site icon TeluguMirchi.com

Mirai : 112 కోట్ల గ్రాస్‌తో బాక్సాఫీస్‌లో దుమ్మురేపుతున్న ‘మిరాయ్’..!!

Mirai
Mirai : ‘మిరాయ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తోంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడిగా, రితికా నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 12 న విడుదలైన ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వంద కోట్ల మార్కును దాటి, ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం ముగిసే వరకు 112 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో అధికారకంగా ప్రకటించింది. దీంతో తేజా కెరీర్లో ఈ సినిమా ‘హనుమాన్’ తర్వాత మరో వంద కోట్లు దాటిన సినిమాగా నిలిచిపోతుంది.

ప్రేక్షకుల్లో మొదటినుంచి ఈ సినిమాపై ఏర్పడిన బజ్, చిత్ర యూనిట్ సమర్థవంతమైన ప్రమోషన్ వ్యూహం సినిమాకు భారీ కలక్షన్లను అందించాయి. అయితే, ఇప్పుడు దసరా సెలవులు మొదలవడంతో పాటు, మరో వారం రోజుల వరకు ఎలాంటి పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం వుంది. విదేశాల్లోనూ మంచి స్పందనతో ‘మిరాయ్’ మరింత చర్చనీయ అంశంగా నిలిచింది. ఇకపోతే హీరో తేజ సజ్జా ఈ వీకెండ్ సియాటెల్, డల్లాస్ మరియు న్యూ జెర్సీకి వెళ్ళి అభిమానులతో సమావేశమవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Exit mobile version