
నాగచైతన్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషకర్మ’ ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు కార్తీక్ దండు ఈ ట్రైలర్‌లో పరిచయం చేశారు. సుమారు 5 వేల సంవత్సరాల నాటి గుహ తవ్వకాల నేపథ్యంలో మొదలయ్యే కథలో, మనిషికి అంతుచిక్కని ఓ చీకటి శక్తి బయటకు రావడం ఉత్కంఠను పెంచుతోంది. ప్రాచీన రహస్యాలు, వైదిక శాస్త్రం, అతీంద్రియ శక్తుల చుట్టూ కథ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా విజువల్స్, గ్రాఫిక్స్, సెట్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఒక తెలియని మిస్టరీ కనిపిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తోంది.
ఇక నాగచైతన్య ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన లుక్‌తో కనిపిస్తున్నారు. పరిశోధకుడిగా మొదలై, ఓ మహత్తర శక్తిని ఎదుర్కొనే బాధ్యత తీసుకునే పాత్రలో ఆయన చూపించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మీనాక్షి చౌదరి పాత్రతో పాటు స్పర్శ్ శ్రీవాస్తవ లుక్ కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు కార్తీక్ దండు గతంలో ‘విరూపాక్ష’తో చూపించిన హారర్, మిస్టరీ వాతావరణాన్ని ఈసారి మరింత భారీ స్థాయిలో తీసుకొచ్చినట్లు అనిపిస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత బలాన్ని ఇచ్చింది. మొత్తానికి కథ, విజువల్స్, మేకింగ్ పరంగా ‘వృషకర్మ’ ఓ కొత్త తరహా సినిమాటిక్ అనుభూతిని అందించేలా కనిపిస్తోంది. ఈ సినిమా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
