
Akhanda 2 Thaandavam Trailer : నందమూరి బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేయగా, ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘అఖండ 2: తాండవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపురలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ట్రైలర్ విషయానికొస్తే, బాలయ్య అఘోర రూపంలో ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ట్రైలర్ మొత్తం పవర్‌ప్యాక్డ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్సులుతో ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఇక బోయపాటి మార్క్ డైలాగులు, ఎమోషన్‌తో మిక్స్ చేసిన మాస్ ఎలివేషన్స్, బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఈ ట్రైలర్‌లో ప్రధాన హైలైట్ గా నిలిచాయి. ఎస్. థమన్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ గూస్ బమ్స్ తెప్పించేలా ఉంది. మొత్తానికి బాలయ్య విశ్వరూపం చూపించాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది.
