
The Paradise : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మ్యాసీవ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జోరుగా సాగుతుండగా, తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు అధికారకంగా ప్రకటించారు. అయితే రిలీజ్ టైమింగ్ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారనుంది. ఓనం, మిలాద్-ఉన్-నబీ, రక్షా బంధన్, జన్మాష్టమి వంటి వరుస పండుగలు ఉండటంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఫెస్టివ్ అడ్వాంటేజ్ దక్కే అవకాశం ఉంది. స్ట్రాటజిక్ ప్లానింగ్‌లో నాని చూపించే తెలివితేటలు ఈ రిలీజ్ డేట్‌తో మరోసారి హైలైట్ అయ్యాయి.
ప్రస్తుతం టీమ్ నాని ఇంట్రడక్షన్ సాంగ్ షూట్‌లో బిజీగా ఉంది. వందలాది డ్యాన్సర్లతో భారీ సెట్లో తెరకెక్కుతున్న ఈ పాటకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ హై వోల్టేజ్ మాస్ ట్యూన్ అందిస్తున్నారు. నాని రా ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా మలుస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎనిమిది భాషల్లో పాన్-వరల్డ్ స్థాయిలో విడుదల కానున్న ‘ది ప్యారడైజ్’ ఫెస్టివ్ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునేలా బిగ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది.
Mere Pyaare Paradise Waasiyon – #JadalZamanaFromAug21 🔥🌋🥁#TheParadise GRAND RELEASE WORLDWIDE ON AUGUST 21st, 2026 ❤🔥
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam, Bengali, English, and Spanish.
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An… pic.twitter.com/5TkG6qtnOf— THE PARADISE (@TheParadiseOffl) February 12, 2026
