
Kajal Aggarwal: ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #NBK111. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు (HBD Kajal Aggarwal) తెలిపారు. “ప్రతీ తుఫాను వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది” (Every storm has a reason) అంటూ చిత్ర యూనిట్ విడుదల చేసిన కాజల్ బర్త్‌డే పోస్టర్ ప్రస్తుతం సోషల్ వైరల్ అవుతోంది.
గతంలో బాలకృష్ణ సరసన ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించి మెప్పించిన కాజల్ అగర్వాల్.. మరోసారి ఆయనతో జత కట్టడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా, చాలా వర్సటైల్‌గా ఉండబోతుందని, ప్రేక్షకులు ఆమెలోని సరికొత్త కోణాన్ని చూస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది. వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) పతాకంపై ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైవిధ్యమైన నటుడు మంచు మనోజ్ ఒక పవర్‌ఫుల్ రోల్ పోషిస్తుండగా.. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. గతంలో బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబోలో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, #NBK111 పై ట్రేడ్ వర్గాల్లో, నందమూరి అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
“ EVERY STORM HAS A REASON. "
Happy Birthday @MsKajalAggarwal ❤️🤗
Joining millions in wishing and rooting for you to LIT UP the big screens with #NBK111. pic.twitter.com/6debaFHuJA
— NBK 111 (@NBK111Movie) June 19, 2026
