Site icon TeluguMirchi.com

HHVM : పవన్ కళ్యాణ్ స్టామినాతోనే టికెట్లు తెగుతున్నాయా.?

Hhvm 2

HHVM : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్, నిజాం, ఓవర్సీస్ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఊహించని స్థాయిలో దూసుకుపోతున్నాయి.

రాజకీయ బాధ్యతలతో సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈసారి తిరిగి రాగానే బాక్సాఫీస్‌లో తన అపారమైన క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అతని కెరీర్‌లో ఇప్పటివరకు లేని రికార్డులను సృష్టించేలా ఉందని టాక్.

ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ పీరియడ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ప్రమోషన్లలో భాగస్వామ్యం కావడం, అభిమానుల్లో హైప్‌ను మరింత పెంచింది. ఫలితంగా ప్రీ-రిలీజ్ మోమెంటం అద్భుత స్థాయికి చేరుకుంది.

Exit mobile version