Site icon TeluguMirchi.com

Prabhas: ప్రభాస్ – ఆదిత్య ధర్ – హోంబలే ఫిల్మ్స్ కాంబో.. ఆసక్తి రేపుతున్న టాక్!

Prabhas

Prabhas: గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుండగా, తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఆదిత్య థర్, ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ కాంబినేషన్‌లో ప్రభాస్ ఒక భారీ యాక్షన్ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ ఆదిత్య థర్ ఇప్పటికే ప్రభాస్‌ను రెండు సార్లు కలిసి కథను వినిపించారని సమాచారం. అయితే స్టోరీ నచ్చినప్పటికీ స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు అవసరమని ప్రభాస్ భావించినట్లు తెలుస్తోంది. ఆ మార్పులను సరిచేసి సరికొత్త వెర్షన్‌ను రెడీ చేయాల్సిందిగా డైరెక్టర్‌కి ప్రభాస్ సూచించారట.

ప్రస్తుతం ఆదిత్య థర్ హీరో ప్రభాస్ చెప్పిన మార్పులు, చేర్పులపైనే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి స్క్రిప్ట్‌ను పకడ్బందీగా రూపొందించే పనిలో బిజీగా ఉన్నారట. ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా పూర్తయిన తర్వాత, ఆదిత్య థర్ మరోసారి ప్రభాస్‌ను కలిసి ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే, ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం.. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటన వెలువడడం దాదాపు ఖాయమని ఇండస్ట్రీ వర్గాల టాక్. ‘సలార్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రభాస్ చేయబోయే ఈ సినిమాపై ఇప్పుడే అంచనాలు పెరిగిపోతున్నాయి.

Exit mobile version