
Fauji: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ నుంచి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉన్న ఈ చిత్రానికి మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. “అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది” అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌తో ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రిలీజ్ డేట్‌తో పాటు విడుదలైన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పోస్టర్‌లో ప్రభాస్ రక్తపు మరకలతో, సిక్స్‌ప్యాక్ బాడీతో, సైనికుడి గెటప్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. చుట్టూ యుద్ధభూమిలో పడివున్న మృతదేహాలు, చేతిలో గన్‌తో కనిపిస్తున్న డార్లింగ్ లుక్‌ను బట్టి సినిమాలో యాక్షన్, ఎమోషన్ రెండూ భారీ స్థాయిలో ఉండబోతున్నాయని అర్థమవుతోంది. స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
अज्ञातपर्व ENDS.
THE REBELLION BEGINS 🔥#Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️🔥#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y
— Fauzi (@FauziTheMovie) July 16, 2026
