
Fauzi: డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#Fauzi’. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై సినీ సర్కిల్స్‌లో ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే, కొన్ని వారాల్లోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ టీజర్‌తోనే సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ప్రమోషన్ల వేగాన్ని పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. అందులో భాగంగానే సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయడం, ఈ మూవీలోని కీలక పాత్రలను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోలను రిలీజ్ చేయడం, వినూత్నమైన పబ్లిసిటీ స్టంట్స్‌తో ప్రేక్షకుల్లో సినిమాపై బజ్‌ను కంటిన్యూ చేయడం వంటివి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉండబోతుందని టాక్. ఈ సినిమా డిసెంబర్ రిలీజ్ వార్తతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడే పండగ చేసుకుంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
