Site icon TeluguMirchi.com

#PuriSethupathi : పూజా కార్యక్రమాలతో కొత్త సినిమా స్టార్ట్ చేసిన పూరి జగన్నాథ్


టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. వరుస ఫెయిల్యూర్స్‌తో వెనుకబడిన పూరి, ఈసారి పవర్ఫుల్ కథతో మళ్లీ మాస్ ప్రేక్షకులను కట్టుకోవాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ టబూ, కన్నడ విలన్ దునియా విజయ్ కీలక పాత్రలు పోషించనుండగా, మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ రోజు ఈ సినిమాను గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేస్తూ, నేటి నుంచే విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ పై సీన్లను షూట్ చేయనున్నట్లు తెలియజేశారు. పూరి జగన్నాధ్ ఈ సినిమాకు ఓ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారని సమాచారం. పూరి కనెక్స్ట్, జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఛార్మి, పూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విష్ణు రెడ్డి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ‘బెగ్గర్’ లేదా ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

Exit mobile version