Site icon TeluguMirchi.com

Pushpa 2 : 200 రోజుల్లో ‘పుష్ప’ రాజ్ రూల్.. కౌంట్ డౌన్ స్టార్ట్

Pushpa2


ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్న మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ ‘పుష్ప 2 : ది రూల్’. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్రయూనిట్ దీనికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ చిత్రం విడుదల తేదీకి కౌంట్‌డౌన్‌ను సూచిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేసారు మేకర్స్.

ఇక 200 రోజుల్లో పుష్పరాజ్‌ రూల్‌ మొదలుకానుంది.. ‘పుష్ప ది రూల్’ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అంటూ చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లుక్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథనాయికగా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version