
Raghava Lawrence: ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో, సామాజిక సేవకుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే అంశంపై ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ ఆయన తన అధికారిక X ఖాతాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. సుమారు 18 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ వీడియోలో లారెన్స్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “కర్తవ్యాన్ని నిజాయితీగా, ఏమీ ఆశించకుండా చేయాలి” అని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ప్రజల తీర్పే ఫైనల్..
తాను రాజకీయాల్లోకి రావడంపై పూర్తి నిర్ణయాన్ని ప్రజలకే వదిలేస్తున్నట్లు లారెన్స్ ఈ వీడియో ద్వారా ప్రకటించారు. ఈ సంద్భంగా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “ఈ వీడియో చూసి కామెంట్స్ రూపంలో మీ సలహాలు, మార్గదర్శకత్వాన్ని నాకు అందించండి. ఒకవేళ మీరు ‘నో’ (వద్దు) అని చెబితే నేను రాజకీయాల్లోకి రాను, కేవలం నా సామాజిక సేవలను మాత్రమే కొనసాగిస్తాను. అదే మీరందరూ ‘ఎస్’ (రావాలి) అని చెబితే కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. ఒకవేళ వస్తే.. ఎప్పుడు వస్తాను, ఎవరితో కలిసి నడుస్తాను అనే విషయాలను మీ ఆశీర్వాదాలతో త్వరలోనే వెల్లడిస్తాను” అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
‘టీవీకే’ (TVK) పార్టీలో చేరతారనే ఊహాగానాలు!
ఇటీవలి కాలంలో తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీలో రాఘవ లారెన్స్ చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన తిరుచి ఈస్ట్ బై-ఎలక్షన్‌లో (ఉప ఎన్నిక) పోటీ చేయవచ్చనే ఊహాగానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లారెన్స్ ఈ వీడియోను రిలీజ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ముఖ్యంగా విజయ్ (TVK) అభిమానుల నుంచి ‘ఎస్’ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. లారెన్స్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ వారు మద్దతు తెలుపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రాఘవ లారెన్స్.. ఇప్పుడు రాజకీయ ఎంట్రీపై ప్రజల అభిప్రాయాన్ని కోరడం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రజల కామెంట్ల ఆధారంగా ఆయన తీసుకోబోయే తుది నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Do your duty sincerely, without expecting anything in return.
After watching this video, please share your advice and guidance in the comments. If you say “No,” I will not enter politics and will continue my selfless service to society. But if you say “Yes,” I am ready to enter… pic.twitter.com/VwPFjdaUqy
— Raghava Lawrence (@offl_Lawrence) June 12, 2026
