Site icon TeluguMirchi.com

Buchi Babu: ‘పెద్ది సెట్స్‌లో అప్పుడు కాళ్లు , చేతులు ఆడలేదు’: బుచ్చిబాబు

Adhika masa purnima (2)

Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌లో జరిగిన ఒక భయానక సంఘటన గురించి దర్శకుడు బుచ్చిబాబు షాకింగ్ విషయాలను పంచుకున్నారు. షూటింగ్ టైంలో హీరో రామ్ చరణ్ కంటికి తీవ్ర గాయం కావడంతో తాను ఎంతగానో భయపడిపోయానని, ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేసి ఎలా స్పందించారో చెప్తూ బుచ్చిబాబు ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ.. “సినిమాలోని ఒక కీలకమైన యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న టైంలో రామ్ చరణ్ గారి కంటికి తీవ్రంగా దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు ఆయన కంటి నుంచి రక్తం కారిపోయింది. అదంతా లైవ్‌లో కెమెరాలోనే రికార్డ్ అయింది. చరణ్ గారు రక్తంతో తడిచిపోవడం చూసి నాకు ఒక్కసారిగా చేతులు, కాళ్లు ఆడలేదు.. విపరీతమైన భయం వేసింది” అని లొకేషన్ లోని భయానక వాతావరణాన్ని వివరించారు. కోట్ల మంది అభిమానించే ఒక గ్లోబల్ స్టార్‌కు తన సెట్స్‌లో గాయం అవ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాయని చెప్పుకొచ్చారు. “చరణ్ గారికి దెబ్బ తగిలిందని తెలియగానే.. మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఆ క్షణంలో నాకు గుండె ఆగినంత పనైంది. చిరంజీవి గారు ఫోన్ చేసి నన్ను గట్టిగా తిడతారేమో అని భయపడ్డాను” అని బుచ్చిబాబు వెల్లడించారు. అయితే ఫోన్ ఎత్తిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఊహించని రీతిలో తనకు అండగా నిలిచారు బుచ్చిబాబు పేర్కొన్నారు. “ఆయన ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో ఎంతో నిదానంగా అడిగి తెలుసుకున్నారు. కంగారు పడకు బుచ్చి.. ఆ గాయం అయిన వీడియో క్లిప్ ఒకసారి నాకు పంపించు అని ఎంతో ధైర్యం చెప్పారు” అంటూ ఎమోషనల్ అయ్యారు.

Exit mobile version