
Peddi Day 1 Collection: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చేసింది. భారీ అంచనాల మధ్య నిన్న (జూన్ 4న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ దగ్గర ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. రామ్ చరణ్ తన మాస్ పవర్‌తో థియేటర్ల వైపు ప్రేక్షకులను పరుగులు పెట్టించడంతో టాలీవుడ్‌లో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. మొదటి రోజే బుకింగ్స్, కలెక్షన్ల పరంగా ‘పెద్ది’ సృష్టించిన సెన్సేషన్ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
‘పెద్ది’ మేనియా ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫార్మ్ ‘బుక్ మై షో’ బుకింగ్స్ ఒక ఉదాహరణ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గత 24 గంటల్లోనే ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 6 లక్షల 50 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ అండ్ డే-1 బుకింగ్స్‌గా ఇది సరికొత్త రికార్డులను సెట్ చేస్తోందని మెగా ఫ్యాన్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
నార్త్ అమెరికాలో ‘పెద్ది’ విధ్వంసం.. 2 మిలియన్ మార్కుకు చేరువగా
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ మెగా పవర్ స్టార్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్‌లో ప్రీమియర్స్ అండ్ డే-1 కలెక్షన్లతో కలిపి ఈ సినిమా ఏకంగా 1.8 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. కేవలం మొదటి రోజే 2 మిలియన్ డాలర్ల క్లబ్‌కు అత్యంత చేరువగా వచ్చేసి బాక్సాఫీస్ దగ్గర తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయని అంటున్నారు. బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, రామ్ చరణ్ నటనకు రెహమాన్ బిజిఎం తోడవడంతో ఫ్యాన్స్ థియేటర్లలో మామూలుగా ఎంజాయ్ చేయడం లేదు. ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ నిర్మించింది. మొత్తానికి లాంగ్ గ్యాప్ తర్వాత రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర పక్కా మాస్ హిట్ కొట్టాడని, ఈ వారాంతంలో ‘పెద్ది’ మరిన్ని వసూళ్ల రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
