Site icon TeluguMirchi.com

Peddi Inside Talk: థియేటర్లలో ‘పెద్ది’ సునామీ.. మైండ్ బ్లోయింగ్ ఇన్‌సైడ్ టాక్!

Peddi (2)

Peddi Inside Talk: ‘పెద్ది’ కొన్ని నెలలుగా ఆకలితో ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీ ఇన్‌సైడ్ వర్గాల నుంచి మైండ్ బ్లోయింగ్ టాక్ బయటకు వచ్చింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా.. కేవలం మాస్ మసాలా మూవీ మాత్రమే కాదట, టాలీవుడ్ సినిమా చరిత్రలో నిలిచిపోయే ఒక ‘కల్ట్ క్లాసిక్’ కాబోతోందని ప్రీ-రివ్యూస్ స్పష్టం చేస్తున్నాయి.

వన్-మ్యాన్ షో..
సినిమా విడుదలకు కొన్ని గంటల ముందే అందుతున్న ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చూస్తుంటే.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఈ చిత్రంలో రామ్ చరణ్‌ను మునుపెన్నడూ చూడని నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్‌తో ప్రెజెంట్ చేశారని, సినిమాలో వచ్చే హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తాయని సమాచారం. ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ప్రతి పాత్రకూ అద్భుతమైన ఎమోషనల్ ఆర్క్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో వన్ – మ్యాన్ షో చేశారని టాక్. కొన్ని కీలకమైన ఎమోషనల్ సీక్వెన్స్‌లలో చరణ్ నటన చూసి థియేటర్లలో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకోవడం ఖాయమని ఇన్‌సైడర్స్ చెప్తున్నారు. ఇక గ్లామరస్ బ్యూటీ జాన్వీ కపూర్ వెండి తెరపై కనిపించినప్పుడు ఆమె పాత్ర చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటూ కథకు పెద్ద అసెట్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. అలాగే జగపతి బాబు పాత్ర ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే రేంజ్‌లో ఉండబోతోందని సమాచారం.

సెకండాఫ్‌లో బీజీఎం విధ్వంసం..
సెకండాఫ్‌లోని చివరి 50 నిమిషాలు ప్రేక్షకులను సీట్లలో నుంచి కదలకుండా చేసే పక్కా ఎమోషనల్ రైడ్‌గా సాగుతుందని, రెహమాన్ బీజీఎం థియేటర్లలో విధ్వంసం సృష్టించబోతుందని ఇన్‌సైడ్ వర్గాలు జోస్యం చెప్తున్నాయి. ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణమని టాక్. ఈ ఎమోషనల్ రైడ్‌లో బుచ్చిబాబు వంద శాతం విజయం సాధించాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం రేపటి నుంచి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టించబోతుందో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

Exit mobile version