
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గ్రామీణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పెద్ది’ చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ షాట్ గ్లింప్స్, తొలి సింగిల్ చికిరి చికిరి భారీ స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో వచ్చిన ఈ పాట సోషల్ మీడియాలో గ్లోబల్ లెవెల్‌లో వైరల్ అయింది. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజాగా ‘పెద్ది’ కొత్త షూటింగ్ షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇందులో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరికొన్ని సన్నివేశాలను ఢిల్లీలో కూడా షూట్ చేయాలని ప్లాన్ చేశారు. జనవరి చివరి నాటికి మొత్తం టాకీ పార్ట్ పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ ముఖ్య పాత్రలో కనిపించనుండగా, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక విభాగంలో ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ వంటి టాప్-క్లాస్ క్రాఫ్ట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ‘పెద్ది’ మార్చి 27, 2026న గ్రాండ్ పాన్-ఇండియా విడుదల కానుంది.
