
Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నుంచి వచ్చిన మొదటి సింగిల్ ‘నువ్వుంటే చాలే’ ఇప్పటికే మ్యూజిక్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో నిలిచి బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ రెండో సింగిల్ ‘పప్పీ షేమ్’ ను విడుదల చేశారు. రామ్ పోతినేని హై-ఆక్టేన్ వోకల్స్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ ట్రాక్‌లో ఎనర్జిటిక్ బీట్స్, భాస్కరభట్ల క్యాచి లిరిక్స్ కలిసి యూత్ & ఫెస్టివల్ వైబ్‌ను మరింత ఎలివేట్ చేశాయి. ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) క్రేజ్, అభిమానుల సెలబ్రేషన్‌ను ఈ సాంగ్ అద్భుతంగా ప్రెజెంట్ చేస్తూ, రామ్ తన గ్యాంగ్‌తో కలిసి సెలబ్రేషన్ మోడ్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించే విజువల్స్ అభిమానుల్లో స్టార్ మానియాకి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా రామ్ తొలిసారి పాడిన ఈ పాటలో ఆయన వాయిస్ ఫన్, ఎనర్జీ, కరిజ్మాతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది.
భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ నవంబర్ 28న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
