
Ramayana Trailer: భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం: పార్ట్ 1’ (Ramayana: Part 1) ట్రైలర్ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్ర అధికారిక థియేట్రికల్ ట్రైలర్ జులై 30 (గురువారం) తెల్లవారుజామున 4:15 గంటలకు (IST) ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌గా విడుదల కానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బ్రాహ్మ ముహూర్తంలో ట్రైలర్‌ను విడుదల చేయనున్న నేపథ్యంలో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి ఈ ట్రైలర్‌ను జులై 24న విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ, కొన్ని అనివార్య కారణాలతో వాయిదా వేశారు. తాజాగా కొత్త రిలీజ్ టైమ్‌ను ప్రకటించడంతో సోషల్ మీడియాలో సినిమాపై చర్చ మరింత ఊపందుకుంది. డైరెక్టర్ నితేష్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ విజువల్ వండర్‌లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తుండగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించనున్నారు. రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడి పాత్రను పోషిస్తుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, రకుల్ ప్రీత్‌సింగ్ శూర్పణఖగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తుండటం మరో విశేషం. ఆస్కార్ అవార్డు గ్రహీత సంస్థ DNEG విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సంగీత దిగ్గజాలు ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిర్మాత నమిత్ మల్హోత్రా సుమారు రూ.4,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం 2026 దీపావళి కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
