
Veeradhi Veerulanta: టాలీవుడ్‌లో ఒక భారీ మల్టీస్టారర్ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. మాస్ మహారాజ్ రవితేజ, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు కలిసి వెండి తెరపై సందడి చేయబోతున్నారు. ‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ చిత్రాలతో తనదైన మార్క్ కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి ఈ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
ఈ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ అండ్ ఫన్నీ టైటిల్‌ను పరిశీలిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాకు ‘వీరాధి వీరులంట’ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హసిత్ గోలి గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్లు, అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే పక్కా కమర్షియల్ డ్రామాగా ఉండబోతుందని ఇన్‌సైడ్ వర్గాల టాక్. రవితేజ మాస్ ఎనర్జీకి, శ్రీవిష్ణు టైమింగ్ తోడైతే వెండితెరపై నవ్వుల జాతర ఖాయం అని చెబుతున్నారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం. అనౌన్స్‌మెంట్ వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ రెడీ చేశారట. అంతేకాదు, ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని చెబుతున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
