Site icon TeluguMirchi.com

SIGMA: మైత్రీ చేతుల్లోకి ‘సిగ్మా’ రిలీజ్ రైట్స్!

SIGMA

SIGMA: దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ, టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న భారీ చిత్రం ‘#SIGMA’. మొదలైన నాటి నుంచే ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచిన ఈ ప్రాజెక్ట్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ చిత్రాన్ని గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాక్సాఫీస్ బరిలో పండగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ సందీప్ కిషన్ గట్టి ప్రణాళికతోనే దిగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ సినిమా రిలీజ్ డేట్‌తో పాటే ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసే మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఇంకా ప్రమోషన్స్ ఊపందుకోకముందే ఈ ప్రాజెక్ట్ రైట్స్ కోసం టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ, పంపిణీ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. రాయలసీమ (సీడెడ్) ఏరియా రైట్స్‌ను ప్రముఖ పంపిణీ సంస్థ ‘NVR సినిమా’ చేజిక్కించుకుంది. సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మైత్రీ, ఎన్వీఆర్ వంటి భారీ సంస్థలు ఇంత ముందుగానే రంగంలోకి దిగి బిజినెస్‌ను క్లోజ్ చేశాయని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.

స్టార్ కిడ్‌గా కాకుండా సొంత ప్రతిభతో మెగా ఫోన్ పట్టిన జాసన్ సంజయ్ విజన్, వైవిధ్యమైన కథలతో దూసుకుపోయే సందీప్ కిషన్ ఎనర్జీ కలగలసి ఈ సినిమాను సరికొత్త స్థాయిలో నిలబెట్టనున్నాయి. దసరా సెలవుల సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకునేలా అక్టోబర్ 2 లాంగ్ వీకెండ్‌ను ఎంచుకోవడం చిత్రానికి ట్రేడ్ పరంగా పెద్ద అడ్వాంటేజ్ కానుంది. టాలీవుడ్ టాప్ డిస్ట్రిబ్యూటర్ల అండ తోడవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో థియేటర్లు కేటాయించేందుకు మార్గం సుగమమైంది.

Exit mobile version