Site icon TeluguMirchi.com

Sumanth Prabhas: సుమంత్ ప్రభాస్ కొత్త సినిమా ఫిక్స్.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ డైరెక్టర్‌తో క్రేజీ లవ్ స్టోరీ!

Mem Famous

Sumanth Prabhas: ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుమంత్ ప్రభాస్. ఇటీవల ‘గోదారి గట్టుపైన’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన ఈ యంగ్ హీరో.. ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ సాయిలు కంపాటి దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇటీవల తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకున్న సాయిలు కంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఏషియన్ ఫిల్మ్స్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పూర్తి స్థాయి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక సరదా ప్రేమకథగా దీనిని తెరకెక్కుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సాయిలు కంపాటి మార్క్ రూటెడ్ ఎమోషన్స్, సుమంత్ ప్రభాస్ ఎనర్జిటిక్ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెబుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరలోనే పూజా కార్యక్రమాలతో సినిమాను అధికారికంగా ప్రారంభించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Exit mobile version