Site icon TeluguMirchi.com

SC on OTT Content : ఓటిటి అడల్ట్ కంటెంట్ నియంత్రణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు..


ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లలో చెక్ లేకుండా సె*క్సువల్ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో, ఓటిటి కంటెంట్ నియంత్రణపై కేంద్రానికి నోటీసులు జారీచేసిన సుప్రీం, స్పందన కోరింది. ఇప్పటికే ఓటిటి కంటెంట్ కోసం పలు మార్గదర్శకాలు విడుదల చేసిన విషయాన్ని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అయినప్పటికీ, అభ్యంతరకరమైన కంటెంట్ విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ బీహార్ గవాయ్ వ్యాఖ్యానిస్తూ, “కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల పనితీరులో జోక్యం చేసుకుంటున్నామన్న విమర్శలు మాపై వస్తున్నాయి,” అని తెలిపారు. అయినప్పటికీ, అభ్యంతరకర కంటెంట్ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉంది. ఓటిటి కంటెంట్ నియంత్రణపై మరింత స్పష్టమైన విధానం రూపొందించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Exit mobile version