Site icon TeluguMirchi.com

Srikanth Odhela: ‘ది ప్యారడైజ్’ తర్వాత ఓదెలకు బిగ్ ఛాలెంజ్.. మెగా మూవీతో తేలనున్న సత్తా!

Srikanth Odhela

Srikanth Odhela: ‘దసరా’ సినిమాతో డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో.. ‘ది ప్యారడైజ్’ సక్సెస్ శ్రీకాంత్ ఓదెల కెరీర్‌లో కీలకంగా మారనుంది. అయితే ఓదెలకు అసలు సవాలు ‘ది ప్యారడైజ్’ తర్వాతే మొదలుకానుందనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవితో ఆయన తెరకెక్కించబోయే సినిమా మరింత భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. స్టోరీ, మేకింగ్, యాక్షన్‌తో పాటు సినిమాను ఏ స్థాయిలో ప్రెజెంట్ చేయబోతున్నారనే అంశంపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.

భారీ స్కేల్‌లో సినిమా చేయడం ఒక ఎత్తయితే.. దానికి తగ్గట్టుగా బడ్జెట్‌ను కంట్రోల్ చేయడం, షూటింగ్ షెడ్యూల్స్‌ను పక్కాగా ప్లాన్ చేయడం మరో కీలకమైన అంశంగా చెబుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోతో తెరకెక్కే భారీ సినిమాలకు షూటింగ్ లేట్ అయితే దాని ప్రభావం బడ్జెట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్‌పై కూడా పడే అవకాశం ఉంటుంది. దీంతో మెగాస్టార్ సినిమాతో శ్రీకాంత్ ఓదెలకు క్రియేటివ్‌గా మాత్రమే కాకుండా ప్రొడక్షన్ పరంగానూ సత్తా చాటాల్సిన అవసరం ఉంటుంది.

ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’పై ఉన్న అంచనాలను అందుకుని సినిమా బ్లాక్ బస్టర్ అయితే అది ఓదెలకు చిరంజీవి సినిమాకు మరింత బలమైన బూస్ట్‌గా మారనుంది. ఇప్పటికే తన టేకింగ్‌తో ఆకట్టుకున్న ఈ డైరెక్టర్.. నెక్ట్స్ సినిమాతో తన స్కేల్‌ను ఎంతవరకు పెంచుకుంటాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ‘ది ప్యారడైజ్’ ఓదెలకు మరో కీలక విజయం అందించాల్సి ఉండగా.. ఆ తర్వాత మెగాస్టార్‌తో చేయబోయే సినిమా మాత్రం ఆయన కెరీర్‌లోనే అతిపెద్ద పరీక్షగా మారే అవకాశముంది. క్రియేటివిటీతో పాటు భారీ బడ్జెట్, షూటింగ్ షెడ్యూల్, మేకింగ్‌పై కంట్రోల్ సాధించగలిగితే శ్రీకాంత్ ఓదెలను ఈ సినిమా మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.

Exit mobile version