
Anil Ravipudi: మన శంకర వరప్రసాద్ గారు వంటి మెగా హిట్ తర్వాత హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆయన డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఒక క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ డేట్ లాక్ అయింది. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుంచి స్టార్ట్ కానుందట. హైదరాబాద్‌లోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. విశేషం ఏంటంటే.. షూటింగ్ స్టార్టింగ్ నుంచే సినిమా ప్రమోషన్స్‌ను కూడా ఫుల్ స్వింగ్‌లో మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఈ చిత్రంలో వెంకటేష్ – కల్యాణ్ రామ్ ఇద్దరూ పూర్తి స్థాయి పాత్రల్లో కనిపించనున్నారు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ థియేటర్లలో ఐ-ఫీస్ట్‌లా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో వెంకీ మామాకు జోడిగా కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారని సమాచారం. హిలేరియస్ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించడంలో దిట్ట అయిన అనిల్ రావిపూడి.. ఈ సారి తన మార్క్ కామెడీతో పాటు స్ట్రాంగ్ ఎమోషన్‌ను కూడా పక్కాగా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. హిట్ కాంబినేషన్లకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి, ఈ ఇద్దరు స్టార్ హీరోలను వెండి తెరపై ఎలా చూపించబోతున్నారనేది ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
