
Jana Nayakudu: తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయకుడు’. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా, తాజాగా విడుదలైన కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. మాస్ లుక్‌తో విడుదలైన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, సినిమాపై మరోసారి చర్చ మొదలయ్యేలా చేసింది. తాజా పోస్టర్‌లో విజయ్ పోలీస్ యూనిఫామ్‌లో ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తూ చేతిలో కత్తి పట్టుకుని కనిపించారు. ముఖ్యంగా “ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు జోసెఫ్ విజయ్” అనే ట్యాగ్‌లైన్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది.
దర్శకుడు హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ నటిస్తున్న చివరి సినిమా ఇదే కావచ్చనే ప్రచారం కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారింది. దీంతో ‘జన నాయకుడు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూలై 23న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పగా, తాజా పోస్టర్ ఆ హైప్‌ను మరింత పెంచింది. మరి బాక్సాఫీస్ వద్ద ‘జన నాయకుడు’ ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#JananayaganFromJuly23 🥳🧨💥 pic.twitter.com/tpPgYsSKRe
— Anirudh Ravichander (@anirudhofficial) July 15, 2026
