Site icon TeluguMirchi.com

Geethu Mohandas: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ బర్త్‌డే గిఫ్ట్ అదిరింది.. వైరల్ అవుతున్న ‘టాక్సిక్’ వీడియో!

Geethu Mohandas

Geethu Mohandas: స్టార్ హీరో యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్’. ఈ సినిమా షూటింగ్ విశేషాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర యూనిట్ అభిమానులకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. టాక్సిక్ అధికారిక ‘ఎక్స్’ అకౌంట్ నుంచి ఒక క్రేజీ బీటీఎస్ (Behind The Scenes) వీడియోను రిలీజ్ చేశారు.

63 సెకన్ల విజువల్ ఫీస్ట్..
స్పెషల్ గిఫ్ట్‌గా రిలీజ్ చేసిన 63 సెకన్ల బీటీఎస్ మాంటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో రిలీజ్ అయిన కొద్ది సేపట్లోనే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. విజువల్స్ చూసిన నెటిజన్లు, యష్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “గీతక్కా గట్టిగానే కుక్ చేసింది”, “విజువల్స్ అదిరిపోయాయి”, “ఇంతకీ రిలీజ్ డేట్ ఎప్పుడు?” అంటూ నెట్టిజన్లు క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు. ఈ బీటీఎస్ వీడియోను బట్టి చూస్తే టాక్సిక్ సినిమాను ఎంతటి భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ – మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని నిర్మిస్తున్నారు. గతంలోనే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. త్వరలోనే రిలీజ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

Exit mobile version