Site icon TeluguMirchi.com

Toxic Special Glimpse: ఒక్కొక్కరిగా వస్తారా,. ఒకేసారి వస్తారా! ‘టాక్సిక్’ నుంచి ‘లేడీస్ & లేడీస్’ ఊరమాస్ గ్లింప్స్..

Toxic

Toxic Special Glimpse: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic Movie). ప్రస్తుతం ఈ సినిమా స్పెషల్ ట్రైలర్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఈ సినిమా నుంచి ‘లేడీస్ & లేడీస్’ (Ladies and Ladies) పేరుతో విడుదలైన స్పెషల్ గ్లిమ్స్ ప్రస్తుతం నెట్టింట విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ డార్క్, స్టైలిష్, డేంజరస్ ప్రపంచాన్ని శాసించబోయే ఐదుగురు శక్తివంతమైన మహిళాలను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ బోల్డ్ వీడియోను వదిలారు. పవర్, మిస్టరీ, అటిట్యూడ్, అడ్రినలిన్ రష్‌తో నిండిన ఈ గ్లిమ్స్.. సినిమాలో లేడీస్ పాత్రలు ఎంత ఊరమాస్ రేంజ్‌లో ఉండబోతున్నాయో స్పష్టం చేసింది.

ఈ క్రేజీ వీడియోలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి వంటి ఇండియన్ సినిమా టాప్ హీరోయిన్లు తమ అల్ట్రా స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మైండ్ బ్లాక్ చేశారు. లేడీ సూపర్ స్టార్ నయనతార అత్యంత పవర్‌ఫుల్ అండ్ ఫియర్స్ లుక్‌లో కనిపించగా, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ విభిన్నమైన, మ్యాగ్నెటిక్ ఎనర్జీతో మెప్పించింది. ఇక తారా సుతారియా చలాకీగా, రుక్మిణి వసంత్ తీవ్రమైన ఇంటెన్సిటీతో, హ్యూమా ఖురేషి ఆకట్టుకున్నారు. “పిల్లలు.. దూరంగా ఉండండి. తల్లిదండ్రులు.. మీ పిల్లలను దూరంగా ఉంచండి. నానమ్మ, తాతమ్మలు.. మీ పిల్లల పిల్లలు దూరంగా ఉండేలా చూసుకోండి. ఇక ముత్తాతలు.. మీ స్వంత రిస్క్‌పైనే చూడండి” అంటూ మేకర్స్ ఇచ్చిన క్యాప్షన్ ఈ సినిమా ఏ రేంజ్ రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో రాబోతుందో హింట్ ఇచ్చింది. డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మార్క్ విజువల్స్, స్టైలైజ్డ్ యాక్షన్ ఎపిసోడ్స్, ఇంట్రిగ్యూయింగ్ అట్మాస్ఫియర్ సినిమాపై అంచనాలను స్కై హైకి చేర్చాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు ఇంగ్లీష్ భాషల్లో కూడా ఒకేసారి ఈ ఏడాది ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. యశ్ ‘కేజీఎఫ్’ సిరీస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version